Newspaper Banner
Date of Publish : 08 November 2025, 2:57 pm Editor : admin

పోలీసు గౌరవ ప్రతిష్టలు పెంచే విధంగా విధుల నిర్వహణ చేపట్టాలి

Advertisement


*మండల పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు.*

*విపిఓ విధానాన్ని అమలు చేసి సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలి.*

*పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు సక్రమంగా జరగాలి.*

*బాధితుల ఫిర్యాదులను పరిష్కరించే దిశగా కృషి చేయాలి*

*విధులలో నిజాయితీ, క్రమశిక్షణ తప్పనిసరి.*

*నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి.*

*మండలంలో సిసిటివి కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలి.*

*తాంసి పోలీస్ స్టేషన్ పరిశీలన.*

*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్*

వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించడానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ఈరోజు తాంసి పోలీస్ స్టేషన్ను సందర్శించి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారిని పూల మొక్కతో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, మరియు రూరల్ సీఐ కె ఫణిధర్, తాంసి ఎస్ఐ జీవన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. మొదటగా సిబ్బంది ఏర్పాటుచేసిన గౌరవ వందనాన్ని స్వీకరించిన జిల్లా ఎస్పీ, పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించి పరిశుభ్రతపై ప్రశంసించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా సిబ్బందిని కేటాయించి, పోలీసు గౌరవ ప్రతిష్టలు పెంచే విధంగా విధుల నిర్వహణ చేపట్టాలన్నారు. సమాజంలో నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఉండాలని, అమాయకులను, బాధితులను మోసం చేసే మోసగాళ్ల పై చట్టపరంగా చర్యలను తీసుకోవాలని సూచించారు. పోలీసు గౌరవానికి భంగం కలిగించే వారిని, విధులకు ఆటంకపరచిన వారిని ఉపేక్షించరాదని తెలియజేశారు. మండలంలో ప్రతి ఒక్క గ్రామానికి విపిఓ ని కేటాయించి వీలైనంత సార్లు సందర్శిస్తూ సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకుని ఆ సాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాహన ప్రమాదాలు జరగకుండా రోడ్డుపై సాయంత్రం సమయాలలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా పర్యవేక్షించాలన్నారు. మండలంలో ఎలాంటి గంజాయి, గుడుంబా, మాదకద్రవ్యాలు సేవించడం, రవాణా, పండించడం, వ్యాపారం లాంటివి జరగకుండా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాల నిర్వహించే నేరస్తులపై కేసులు నమోదు చేస్తూ ఉండాలని తెలిపారు. మండలంలో నేరాల నివారణకు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలని సైబర్ క్రైమ్, మహిళల పట్ల జరుగు నేరాలు, బాలికల పట్ల జరుగు నేరాలపై, బాల్య వివాహాలు జరగకుండా చైతన్య పరచాలని సూచించారు. యువతకు భవిష్యత్తుపై మరియు వారి బాధ్యతలను తెలిసే విధంగా చైతన్య పరచాలన్నారు. గ్రామంలో సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తూ, గ్రామస్తులకు సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యత పై తెలియజేయాలన్నారు. రికార్డులను పరిశీలించి ఎలాంటి పెండెన్సీ లేకుండా చూడాలన్నారు, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను దర్యాప్తు పూర్తి చేసి కోర్టు నందు చార్జి షీటు దాఖలు చేయాలని తెలియజేశారు. రిసెప్షన్, బ్లూ కోర్ట్ ,డయల్ హండ్రెడ్, సిడిఓ, వర్టికల్స్ నిర్వహించే సిబ్బంది విధులను ప్రతివారం క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో సిబ్బంది సమక్షంలో అధికారులందరూ మొక్కలు నాటి పచ్చదనం పై దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్క సిబ్బంది కి కేటాయించిన పోలీసు ఆర్టికల్స్ మరియు సామాగ్రిని పరిశీలించి సర్వీసును సక్రమంగా నిర్వహించాలని ఎలాంటి రిమార్కులు లేకుండా ఉండాలని తెలిపారు. ప్రతి శనివారం పోలీస్ పరేడ్ నిర్వహిస్తూ ఉండాలని, పరేడ్ వల్ల శారీరక మానసిక దృఢత్వం లభిస్తాయి అని, పోలీసు గౌరవం పరేడ్ వల్ల లభిస్తుందని తెలిపారు. లాఠీ పరేడ్ నిర్వహించి, అత్యవసర పరిస్థితులలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణను పరిశీలించారు. విధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నగదు రివార్డులు, ప్రశంసాపత్రాలను అందజేసి ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి రూరల్ సీఐ కె ఫణిందర్ తాంసి ఎస్ఐ ఎస్ జీవన్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share this article:

WhatsApp Facebook Twitter Telegram LinkedIn