Newspaper Banner
Date of Publish : 11 November 2025, 9:12 am Editor : admin

జగన్ అక్రమాస్తుల కేసు – కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కోర్టు ఆదేశం

Advertisement
- వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌పై విచారణ
- వీడియో కాన్ఫరెన్స్ హాజరుకు సిద్ధమని జగన్ వెల్లడి

హైదరాబాద్, నవంబర్ 10 :
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో, వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సీబీఐ కోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 14వ తేదీ లోపు వ్యక్తిగతంగా హాజరుకావాలని సీబీఐ కోర్టు జగన్‌కు ఆదేశించింది. గడువు సమీపిస్తుండడంతో, తాజాగా జగన్ తరఫు న్యాయవాదులు మెమో దాఖలు చేసి, వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కల్పించాల్సిందిగా కోరారు. కోర్టు అనుమతిస్తే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకావడానికి సిద్ధంగా ఉన్నట్టు మెమోలో పేర్కొన్నారు. జగన్ పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు, సీబీఐ తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించింది. దీనిపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన అనంతరం తదుపరి విచారణ కొనసాగనుంది.

Share this article:

WhatsApp Facebook Twitter Telegram LinkedIn