రాష్టప్రతి ద్రౌపదీ ముర్ము ను కలిసిన మహిళల క్రికెట్ జట్టు

రాష్టప్రతి ద్రౌపదీ ముర్ము ను కలిసిన మహిళల క్రికెట్ జట్టు

న్యూఢిల్లీ, నవంబర్ 06 (డిజైనర్ టెక్ గురు ప్రతినిధి): ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్ కప్–2025 విజేత భారత మహిళా క్రికెట్ జట్టు రాష్టప్రతి భవన్‌లో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ను కలిసి శుభాకాంక్షలు అందుకుంది. ఈ సందర్భంగా ముర్ము జట్టు సభ్యులను అభినందిస్తూ, “మీరు చరిత్ర సృష్టించారు. మా దేశ యువతకి మీరు ఆదర్శం” అని పేర్కొంది. ఈ జట్టు దేశ వైవిధ్యానికి ప్రతీకగా నిలిచిందని ముర్ము భావోద్వేగంగా చెప్పింది. దేశంలోని రాంతాల నుంచి, భిన్న సామాజిక నేపథ్యాలతో వచ్చినా... ఒకే లక్ష్యం కోసం పోరాడి విజయం సాధించిన టీమ్ ఇది—‘టీమ్ ఇండియా’ అని ఆమె స్పష్టం చేసింది.
మహిళల క్రీడలకు దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ నేపధ్యంలో ఈ విజయం ఎంతో ప్రేరణాత్మకమని రాష్టప్రతి పేర్కొంది. భారత జట్టు వరల్డ్ కప్ గెలిచిన నేపధ్యంలో ఆటగాళ్ల త్యాగం, కష్టపాటు, నిబద్ధత దేశానికి గర్వకారణమని ఆమె అభినందించింది.
సమావేశంలో బిసిసిఐ ప్రతినిధులు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్, ఎంపిక కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు.

📰 e-Paper Clip