భారత్–అంగోలా భాగస్వామ్యానికి కొత్త ఊపు

భారత్–అంగోలా భాగస్వామ్యానికి కొత్త ఊపు

- శక్తి, రక్షణ, డిజిటల్ రంగాల్లో సహకారం బలోపేతం

న్యూ ఢిల్లి, నవంబర్ 09 :
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు అంగోలా రాష్ట్రపతి జువావో మాన్యుయేల్ గోన్సాల్వెస్ లోరెన్సో మధ్య విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇరుదేశాలు శక్తి భాగస్వామ్యం, మౌలిక వసతులు, రక్షణ, ఆరోగ్యరంగం, వ్యవసాయం, డిజిటల్ టెక్నాలజీలలో పరస్పర సహకారాన్ని మరింతగా పెంచాలని అంగీకరించాయి. ఈ సందర్భంగా అంగోలా అభివృద్ధి యాత్రలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ కొనసాగుతుందని రాష్ట్రపతి ముర్ము స్పష్టంచేశారు. ద్వైపాక్షికంగానే కాకుండా ఇండియా–ఆఫ్రికా ఫోరం సమిట్ పరిధిలోనూ అంగోలాతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. భారత తరఫున జల్‌శక్తి మరియు రైల్వే శాఖల మంత్రి వి. సోమన్న,పర్బుభాయ్ నగర్భాయ్ వసావా, డీ.కె. అరుణ తదితర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఇక ఈ భేటీ సందర్భంగా మత్స్య, జలకళ, సముద్ర వనరుల అభివృద్ధి మరియు కౌన్సులర్ వ్యవహారాల్లో సహకారం అంశాలపై రెండు దేశాలు (ఒప్పందాలు) కుదుర్చుకున్నాయి.

📰 e-Paper Clip