తొలి మెరుపు ఏంటో మరి.. ?
హైదరాబాద్, నవంబర్ 4 (డిజైనర్ టెక్ గురు ప్రతినిధి):
మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న సినిమా కాంత . పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమా నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్, టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీని నవంబర్ 14న విడుదల చేస్తున్నారు.ఇటీవలే రేజ్ ఆఫ్ కాంత ట్రాక్‌ను విడుదల చేయగా సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సాయంత్రం 4 గంటలకు తొలిమెరుపు ఉండబోతుందని నేడు కొత్త పోస్టర్ లాంచ్ చేశారు. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని రోల్స్‌తో డిజైన్ చేసిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇంతకీ ఆ తొలి మెరుపు ఏంటనేది మరికొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. ఇప్పటికే కాంత మూవీ నుంచి అమ్మాడివే సాంగ్‌ను విడుదల చేశారని తెలిసిందే. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే కాంబోలో వచ్చే ఈ మెలోడీ ట్రాక్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. భారతీయ సినిమాలో 1960ల నాటి గత యుగానికి నివాళిగా తెరకెక్కుతున్న కాంత సినిమాకు దుల్కర్ సల్మాన్‌తోపాటు టాలీవుడ్ యాక్టర్ రానా దగ్గుబాటి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు.