ట్యూషన్‌కి వెళ్లిన బాలికపై

ట్యూషన్‌కి వెళ్లిన బాలికపై

-ముగ్గురు సామూహిక అత్యాచారం

కోల్‌కతా, నవంబర్ 3 (డిజైనర్ టెక్ గురు ప్రతినిధి): పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ట్యూషన్‌ కోసం ఇంటి నుంచి వెళ్లిన 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డమ్‌డమ్ ప్రాంతానికి చెందిన ఆ బాలిక ఏడో తరగతి చదువుతోంది.

శనివారం సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. ఈ సమయంలో ఒక పార్క్‌ వద్ద తెలిసిన వ్యక్తిని కలిసింది. కొద్దిసేపటికే మరో ఇద్దరు వ్యక్తులు అక్కడకు వచ్చారు. ముగ్గురూ కలసి ఆ బాలికను బలవంతంగా ఆటోలో మోతీలాల్ కాలనీలోని ఒక ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆ బాలికపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ రాత్రే బాధితురాలు తప్పించుకుని ఇంటికి చేరి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. వెంటనే వారు పోలీసులను సంప్రదించారు. బాలిక ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

దర్యాప్తులో భాగంగా నిందితులుగా సంజు సాహా, విక్కీ పాస్వాన్‌, రాజేష్‌ పాస్వాన్‌లను గుర్తించి అరెస్ట్‌ చేశారు. వారిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మరింతగా దర్యాప్తు కొనసాగుతోంది.

📰 e-Paper Clip

Tags

Crime news