బ్రష్‌ ఎన్ని రోజులు ఉపయోగించాలి?

బ్రష్‌ ఎన్ని రోజులు ఉపయోగించాలి?

మనం ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ కచ్చితంగా బ్రష్‌ చేయడం ఆనవాయితీగా మారింది.. జస్ట్‌ బ్రష్‌ చేయడమే కదా అని లైట్‌ గా తీసుకుంటున్నారా అయితే ప్రమాదంలో పడినట్టేనట.. దంతాలను బ్రష్‌ సరిగ్గా చేయకపోవడంతో పలు రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని ఇటీవలే కొంతమంది డెంటిస్టులు తెలియజేస్తున్నారు.. సక్రమంగా బ్రష్‌ చేయకపోవడం వల్ల గుండెజబ్బులు ,క్యాన్సర్‌ , వంటి డయాబెటిస్‌ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా గురయ్యేలా చేస్తున్నాయని తెలియజేస్తున్నారు.. ముఖ్యంగా నోటిలో ఉండేటువంటి సూక్ష్మజీవులు దిగువుకు వెళ్లి కడుపులో ఆమ్లం పైన చాలా ప్రభావాన్ని చూపిస్తాయని ఇటీవలే అమెరికన్‌ పరిశోధకులు గుర్తించారట.200 ప్రేగు క్యాన్సర్‌ కేసులను సైతం అక్కడ సైంటిస్టులు గుర్తించినట్లు తెలుస్తోంది. సూక్ష్మజీవులు క్యాన్సర్‌ పురోగతిని ప్రేరేపిస్తాయని దీనివల్ల కాలక్రమమైన ప్రాణాంతకమైన వ్యాధిగా మారుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు.. దంతాల అశుభ్రత పెద్ద ప్రేగు క్యాన్సర్‌ చాలా ప్రమాదానికి గురయ్యేలా చేస్తాయట.. అయితే నోటిలో కొన్ని సహజమైన బాక్టీరియాలో ఉంటాయని పరిశోధకులు చొప్పినప్పటికీ సరైన విధంగా బ్రష్‌ చేయకపోతే ఇవి పెద్ద ప్రేగుకు చేరుకొని క్యాన్సర్‌ ప్రమాదాన్ని సృష్టిస్తాయట. నోటిలోని క్రిములు ఇతర శరీర భాగాలను కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.. ముఖ్యంగా ఫ్యూసోబ్యాక్టీరియం, న్యూక్లియేటమ్‌ వంటి పిలవబడే బ్యాక్టీరియా కోలోరెక్టాల్‌ క్యాన్సర్‌ కారకాలకు దారితీస్తుందట.. అందుకే ప్రతి ఒక్కరు ఉదయం లేవగానే బ్రష్‌ చేయడం పైన కాస్త శ్రద్ధ వహించడం మంచిదని నిపుణులు వెల్లడిస్తున్నారు.. శుభ్రమైన బ్రష్‌ చేయడం వల్ల ఆరోగ్యకరమైన గుండె తీరును కలిగిస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే చాలామంది ఒకే బ్రష్‌ ను ఎక్కువ కాలం పాటు వాడుతున్న చాలా ప్రమాదమని కచ్చితంగా మూడు లేదా 6 నెలలకు ఒకసారి అయినా బ్రష్‌ను మారుస్తూ ఉండాలని వైద్యుల సైతం తెలియజేస్తున్నారు. అప్పుడే దంతాలు చాలా శుభ్రంగా ఉండడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటాయని వెల్లడిస్తున్నారు.

బ్రష్‌ ఎన్ని రోజులు ఉపయోగించాలి? - Additional Image

ఎండు కొబ్బరి ప్రయోజనాలు...
దాదాపు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఎండు కొబ్బరిని ఉపయోగిస్తారు. పూజ నుండి వంట వరకు అన్నింటిలో కొబ్బరిని ఉపయోగిస్తారు. ఎండు కొబ్బరిని అనేక వంటకాల తయారీలో కూడా ఉపయోగిస్తారు.తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎండు కొబ్బరి పొడిని ఉపయోగించడం వల్ల ఆహారం రుచి పెరగడమే కాకుండా దాని వినియోగం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. కొబ్బరిలో ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్‌, కాల్షియం, మాంగనీస్‌, సెలీనియం, కాపర్‌, ఫాస్పరస్‌, పొటాషియం, మెగ్నీషియం మొదలైనవి ఉంటాయి. అదనంగా ఎండు కొబ్బరిలో యాంటీఆక్సిడెంట్‌ లక్షణాలు ఉన్నాయి. అయితే ఎండు కొబ్బరిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అందుకే ఎండు కొబ్బరి లాభాలు, నష్టాల గురించి తెలుసుకుందాం. రుచి, సువాసన కోసం ఎండు కొబ్బరి తినడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు లభిస్తాయి. ఏదైనా డెజర్ట్‌ లేదా వంటలో ఎండు కొబ్బరిని జోడిరచడం వల్ల దాని రుచి మరింత పెరుగుతుంది. ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. అనేక ఇతర వ్యాధులు కూడా నయమవుతాయి. దీని గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్‌ ను సులభంగా తగ్గిస్తాయి. తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా ఆహారంలో కొబ్బరిని తీసుకోవాలి. ఎండు కొబ్బరిని తినడం వల్ల మన మెదడు పదును పెట్టడమే కాకుండా జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అదే సమయంలో మన హృదయాన్ని బలపరుస్తుంది. కొబ్బరిని పొడి లేదా తడి రూపంలో తినడం మన జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండు కొబ్బరి తినడం వల్ల మన జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. ఇది క్రమంగా కొత్త జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది.

బ్రష్‌ ఎన్ని రోజులు ఉపయోగించాలి? - Additional Image

సోంపు వాటర్‌ తాగుతున్నారా?
డిహైడ్రేషన్‌ నుండి ఉపశమనం కోసం నిమ్మరసం, షికంజి, షర్బత్‌, సత్తు, చెరకు రసం వంటివి తీసుకోవడం ఉత్తమం.. ఇది శరీరానికి రెట్టింపు ప్రయోజనాలను అందిస్తుంది. వీటితో పాటు వేసవిలో ఉపశమనాన్ని అందించే సోంపు వాటర్‌ తాగడం కూడా శరీరానికి, ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. సోంపు వాటర్‌ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. సోంపు వాటర్‌తో శరీరం చల్లగా ఉంటుంది. ఇది కూలింగ్‌ ఎఫెక్ట్‌ని కలిగి ఉంటుంది. సోంపు వాటర్‌ తాగడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. డీహైడ్రేషన్‌ సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు. సోంపు వాటర్‌ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అనేక రకాల విటమిన్లు కూడా ఉన్నాయి. ఇవి మన శరీరం అనేక విధులకు అవసరం. సోంపు జీర్ణశక్తిని మెరుగుపరచడంతో ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించే శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. సోంపులో జింక్‌, ఫాస్పరస్‌, సెలీనియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్‌ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి, ప్రతి రోజు వీటిని నమిలి తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నవారు ఈ సోంపు వాటర్‌ తీసుకోవచ్చు. శరీర బరువును నియంత్రించేందుకు ఫైబర్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజు సోంపును తాగడం వల్ల శరీర బరువుకు కూడా సులభంగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. సోంపు వాటర్‌ బరువు తగ్గించడంతో పాటు, శరీర వేడిని అదుపులో ఉంచుతుంది. జీవక్రియను పెంచుతుంది. కడుపును నిండుగా ఉంచుతుంది. శరీరానికి కావాల్సిన శక్తిని వేగంగా అందించటంలో సహాయపడుతుంది. మీరు కూడా వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే, తప్పకుండా ఈ షర్బత్‌ తాగండి.

బ్రష్‌ ఎన్ని రోజులు ఉపయోగించాలి? - Additional Image

డార్క్‌ చాక్లెట్‌ తింటే ఇన్ని లాభాలా..?
డార్క్‌ చాక్లెట్‌ ను క్రమం తప్పకుండా మోతాదులో తినడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. ఇది మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. డార్క్‌ చాక్లెట్‌ కూడా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.డార్క్‌ చాక్లెట్‌ కేలరీలతో నిండి ఉన్నప్పటికీ ఇది బరువు తగ్గడానికి అనుకూలంగా ఉంటుంది.డార్క్‌ చాక్లెట్‌ మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. డార్క్‌ చాక్లెట్‌ తినడం వల్ల మీ శరీరంలో నైట్రిక్‌ ఆక్సైడ్‌ లెవల్‌ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. డార్క్‌ చాక్లెట్‌లో ఉండే అధిక మొత్తంలో మెగ్నీషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. డయాబెటీస్‌ పేషెంట్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపడతాయి. డార్క్‌ చాక్లెట్‌ ను తింటే ఆకలి కంట్రోల్‌ అవుతుంది. అలాగే ఈ చాక్లెట్‌ గట్‌ లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే థియోబ్రోమిన్‌ శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఎన్‌-ఎసిల్‌ ఇథనోలమైన్స్‌ (యూఫోరిక్‌ ప్రభావాన్ని కలిగి ఉండే కొవ్వు ఆమ్లం) ఫెనిలేథైలమైన్‌ ( డోపమైన్‌ ను ప్రేరేపిస్తుంది) ఇవన్నీ కూడా డిప్రెషన్‌ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. డార్క్‌ చాక్లెట్‌?లో ఉండే మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు శరీర నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పిల్లల నుంచి పెద్దల వరకు చాక్లెట్స్‌ అంటే ఇష్టపడతారు. అయితే, డార్క్‌ చాక్లెట్‌ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ చాక్లెట్లను తింటే మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వృద్ధాప్య ఛాయలను కూడా తగ్గించుకోవచ్చు.

బ్రష్‌ ఎన్ని రోజులు ఉపయోగించాలి? - Additional Image


ఐస్‌ బాత్‌తో మ్యాజిక్‌..!
సోషల్‌ మీడియాలో చాలా ట్రెండ్స్‌ తరచుగా పుట్టుకొస్తున్నాయి. ఆహారం నుండి ఆరోగ్యం వరకు ప్రతిరోజూ ఒక కొత్త ట్రెండ్‌ కనిపిస్తుంది. ఈ ట్రెండ్‌లో ఇప్పుడు ఐస్‌ బాత్‌ ఒకటి.సోషల్‌ మీడియాలోప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు ఐస్‌ బాత్‌ చేస్తూ కనిపిస్తున్నారు. ఐస్‌ బాత్‌ అంటే.. చల్లటి నీటిలో స్నానం చేయడం.. ఈ రోజుల్లో చాలా మంది సెలబ్రిటీలు ఐస్‌ బాత్‌ చేస్తున్నారు. గత కొంత కాలంగా సెలబ్రిటీలు, సామాన్యుల మధ్య దీని ట్రెండ్‌ వేగంగా పెరిగింది. దీనినే క్రయోథెరపీ అని కూడా అంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అంతే కాదు చర్మానికి, మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఐస్‌ బాత్‌ అంటే చల్లటి నీటిలో స్నానం చేయటం. దీనినే చల్లని నీటిలో డిప్‌ లేదా క్రియోథెరపీ అని కూడా అంటారు. ఇందులో భాగంగా ఆ వ్యక్తిని 11 నుంచి 15 నిమిషాలు నీటిలో ఉంచుతారు. ఈ నీటిని 50 నుంచి 59 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ మధ్య చల్లబరుస్తారు. దీన్ని సాధారణంగా వ్యాయామం తర్వాత ఆరోగ్య ప్రయోజనాల కోసం అథ్లెట్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ, ప్రస్తుతం చాలా మంది సెలబ్రిటీలు కూడా ఐస్‌ బాత్‌ ట్రీట్‌మెంట్‌ ను అలవాటుగా చేసుకుంటున్నారు. ఐస్‌ బాత్‌తో కండరాల రికవరీని వేగవంతం చేస్తుంది. గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎక్కువ వ్యాయామం, శారీరక శ్రమ చేసిన తర్వాత ఐస్‌ బాత్‌ చేస్తే శరీర మంట, కండరాల నొప్పి చాలా వరకు తగ్గుతుందని చెబుతారు. అంతేకాదు.. ఐస్‌ బాత్‌తో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. గడ్డకట్టే నీటిలో స్నానం చేయడం ద్వారా దాని చల్లని ఉష్ణోగ్రత ప్రసరణను ప్రేరేపిస్తుంది. ఇది కండరాలకు రక్త ప్రవాహాన్ని, ఆక్సిజన్‌ పంపిణీని పెంచుతుంది. ఐస్‌ బాత్‌ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మంచి మానసిక ప్రశాంతతను అందజేస్తుంది. ఇలా చేయడం వల్ల విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. ఇది నిరాశ, ఆందోళన లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది . రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఐస్‌ వాటర్‌ తో స్నానం చేయడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఆరోగ్యంతో పాటు, ఐస్‌ బాత్‌ మన చర్మానికి కూడా చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది.

బ్రష్‌ ఎన్ని రోజులు ఉపయోగించాలి? - Additional Image

జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తింటున్నారా?
ఒకప్పటి ఆహార అలవాట్లకు ఇప్పటి ఆహార అలవాట్లకు చాలా తేడా ఉంది. ప్రస్తుతం పిల్లలకు ఇచ్చే ఆహారం గురించి చాలా ఆలోచించాల్సిందే. కానీ ఏడుస్తున్నారు అని ఏది అడిగితే అది కొనిస్తుంటారు తల్లిదండ్రులు.వాటివల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. కొన్ని సార్లు దీర్ఘకాలిక సమస్యల బారిన పడే ప్రమాదం కూడా ఉంది. ఇక జంక్‌ ఫుడ్స్‌ కు ఇప్పటికే ఎంతో మంది పిల్లలు అలవాటు పడ్డారు. చాక్లెట్స్‌, బిస్కెట్స్‌, ముఖ్యంగా చిప్స్‌ ప్యాకెట్‌ అంటూ ఫుల్‌ గా తింటారు. ఇలా ఎక్కువ జంక్‌ ఫుడ్స్‌ తినడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఏకంగా ఇంగ్లాండుకు సంబంధించిన ఒక అబ్బాయి తన కంటిచూపును కోల్పోయాడు. 15 సంవత్సరాల వయసు ఉన్న ఈ అబ్బాయికి కంటిచూపు పోయింది. ముందుగా మసక మసకగా కనిపించడం తో డాక్టర్‌ వద్దకు తీసుకొని వెళ్లారు తల్లిదండ్రులు. అయితే విటమిన్‌ డి డెఫిషియన్సీ అని చెప్పారు. దానికి సంబంధించిన మందులు ఇచ్చారు డాక్టర్‌. కానీ కొన్ని రోజులకు ఆ బాబుకు కంటి చూపు పోయింది. మళ్లీ డాక్టర్‌ వద్దకు వెళితే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనలేకపోయారు. కానీ రీసెర్చ్‌ చేసిన తర్వాత షాకింగ్‌ విషయాలు తెలిశాయట. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా?ఈ అబ్బాయి రోజు తినే ఫుడ్‌ లో చిప్ప్‌ పాకెట్స్‌, జంక్‌ ఫుడ్స్‌ ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల విటమిన్‌ డి డెఫిషియన్సీ సమస్య పెరిగిపోయిందట. కాల్షియం, విటమిన్స్‌ తగ్గిపోయాయట. దీనివల్ల ఆ అబ్బాయి కంటి నరాల పనితీరు మొత్తం డామేజ్‌ అయింది. దీనివల్ల కంటి చూపును కోల్పోయాడు. ముందుగా మసక మసక కనిపించి, ఆ తర్వాత పూర్తిగా కంటి చూపును కోల్పోయాడు ఈ అబ్బాయి. అయితే కొందరిలో వినికిడి శక్తి కూడా పోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. జంక్‌ ఫుడ్‌ తినే అలవాటు ఉంటే కచ్చితంగా దూరం పెట్టడం ముఖ్యం. అడిగారు కదా ఏడుస్తున్నారు కదా అని చిప్స్‌, కుర్‌ కురేలు ఇవ్వకండి. జంక్‌ ఫుడ్స్‌ కు మరింత దూరంగా ఉంచండి. లేదంటే పిల్లల ఆరోగ్యం దెబ్బతినే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.

📰 e-Paper Clip