అందంతో అద్భుతం చేయాలా..

అందంతో అద్భుతం చేయాలా..

Health Tips : అమ్మాయిలు అందంగా,నిగారింపుగా ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది.అందువల్లనే అమ్మాయిలు తమ ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు.అంతే కాకుండా మార్కెట్‌లో దొరికే క్రీమ్స్‌ వాడుతూ..తమ చర్మాన్ని పాడు చేసుకుంటారు.అయితే ఇంట్లోనే ఈ చిట్కాలు పాటిస్తే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. అంతేకాకుండా,మెటిమలు కూడా ఉండవంట. కాగా, అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి నూనె ముఖ సౌందర్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందంట. కొబ్బరి నూనెలో ఆముదం మిక్స్‌ చేసి రోజూ ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వలన ఫేస్‌ నీట్‌గా క్లీన్‌గా ఉంటుంది.వేసవి కాలంలో ముఖం జిడ్డుగా తయారవుతుంది. అయితే ఈ సమయంలో కొబ్బరి నూనెలో ఆముదం కలిపి రాత్రి సమయంలో ఫేస్‌కు అప్లైచేసి పడుకుంటే, చర్మం పై ఉన్న టాన్‌ తగ్గి, ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా తెల్లవారేసరికి అందంగా కనిపిస్తారంట. అలాగే కొబ్బరి నూనెలో ఆముదం కలిపి ఉదయం స్నానం చేసే ముందు ఫేస్‌కు అప్లై చేసి, 10 నిమిషాల తర్వాత స్నానం చేస్తే, మొటిమలు తొలగిపోతాయి. ముఖం అందంగా,కాంతివంతంగా తయారవుతుంది. అదేవిధంగా ముఖంపై ముడతలు లేదా సన్నని గీతలు వంటి కనిపించినా, రాత్రి పడుకునే సమయంలో ఈ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఫ్రీ రాడికల్స్‌ నుండి చర్మాన్ని రక్షించడమే కాకుండా ముఖంపై వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తాయి.

అందంతో అద్భుతం చేయాలా..   - Additional Image


పాలకూరతో ఆరోగ్యం..
రోజూ తింటే జరిగేది ఇదే!
ఆకు కూరలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది పాలకూరను ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఎందుకంటే దీనిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.పాలకూరలో విటమిన్‌ ఏ, సి,కె తో పాటు ఐరన్‌ , మెగ్నీషియం, పొటాషియం ఉన్నాయి. అందు వలన దీనిని క్రమం తప్పకుండా తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. పాల కూరను ప్రతి రోజూ మన ఆహారంలో చేర్చుకోవడం వలన జీర్ణవ్యవస్థ మెరుగు పడటమే కాకుండా మలబద్ధకం సమస్య నుంచి బయటపడుతాము. అలాగే ప్రతిరోజు పాలకూరను క్రమం తప్పకుండా తినడం ద్వారా కిడ్నీ సమస్యలు దరి చేరవు. పాలకూరలో ఐరన్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ సమస్యతో బాధపడే వారు ప్రతి రోజూ పాల కూరను తినడం వలన ఐరన్‌ లోపం రాకుండా చూసుకోవచ్చు.అంతే కాకుండా పాలకూర రక్తపోటును నియంత్రించి గుండె జబ్బులను రాకుండా ఆపుతుంది. పాలకూరలో ఉండే విటమిన్‌ కె ఎముకల ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. చర్మం నిగారింపులో కూడా పాలకూర ముఖ్య పాత్రపోషిస్తుంది.

అందంతో అద్భుతం చేయాలా..   - Additional Image


గుండె జబ్బులు జయించాలంటే
ఈ పనులు చేయాల్సిందే..!
ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు.. అయితే ఈ సమస్య ఒకప్పుడు వయసు పెరిగిన వారిలో మాత్రమే కనిపించేది కానీ ఇప్పుడు పాతికేళ్లు కూడా నిండని వారిలో కనిపిస్తూ అందరిని భయభ్రాంతులకు గురిచేస్తోంది..మరి గుండె సంబంధిత సమస్యల ద్వారా అకాల మరణం పొందుతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోందని చెప్పవచ్చు. అయితే చాలా వరకు గుండె సమస్యలకు కారణం.. మారుతున్న జీవనశైలి.. తీసుకుంటున్న ఆహారంలో మార్పులే అని నిపుణులు చెబుతున్నారు. మరి ప్రతిరోజు ఈ పనులు చేస్తే మాత్రం గుండె జబ్బులను జయించవచ్చు అని కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఇకపోతే శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరగడంతో పాటు వ్యాయామం తగ్గడం వంటి కారణాలవల్ల గుండెపోటు వస్తుందని.. రోజు రోజుకి పెరుగుతున్న గుండె సమస్యల నుంచి బయట పడాలంటే జీవనశైలి లో కచ్చితంగా కొన్నిరకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు.. ఇక రోజువారి జీవితంలో మూడు రకాల పనులు చేస్తే గుండె సమస్యలు వచ్చే ప్రమాదం నుంచి బయట పడవచ్చట..అవేమిటంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో నడక కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి రోజులో కనీసం 30 నిమిషాలు వేగంగా నడవాలని.. వేగంగా నడవడం వల్ల కండరాలు బలంగా మారడమే కాకుండా గుండె రక్తాన్ని పంపు చేసే సామర్థ్యం కూడా పెరుగుతుందని సమాచారం.. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలను చేయడం అలవాటుగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.. యోగాలో ఒక భాగం అయిన సూర్య నమస్కారం వల్ల మొత్తం 12 రకాల వ్యాయామాలు చేసినట్లు అవుతుంది.. ఉదయాన్నే మీరు కనీసం 20 నిమిషాలు ఈ ఆసనాలు వేయడానికి కేటాయిస్తే.. ఖచ్చితంగా గుండె, ఊపిరితిత్తులు బలోపేతం అయి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.. గుండె జబ్బులు రాకుండా ఉండాలి అంటే సైకిల్‌ తొక్కడాన్ని అలవాటుగా చేసుకోవాలి. వారంలో నాలుగు నుంచి ఐదు రోజులైనా కనీసం రోజుకు 30 నిమిషాల పాటు సైకిల్‌ తొక్కడం అలవాటు చేసుకుంటే గుండె సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.


డయాబెటిక్‌ పేషెంట్లు
ఈ డ్రిరక్స్‌ తాగితే చాలా మంచిది?
డయాబెటిక్‌ పేషెంట్లు ఇప్పుడు చెప్పే టీలని తాగితే వారి ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.తులసి టీలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి.తులసి ఆకులు హైపోగ్లైసీమిక్‌ ప్రభావాలను కలిగి ఉన్నాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దీని కోసం, ఒక కప్పు వేడి నీటిలో కొన్ని తులసి ఆకులను వేసి 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రుచి కోసం కొంచెం తేనె కలుపుకుని తాగేయొచ్చు.వాము జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. వాము టీ తయారు చేయడానికి ఒక గ్లాస్‌ నీటిలో పావు చెంచా వాము వేసి 5 నిమిషాలు మరిగించండి. కాస్త ఆ తర్వాత వడకట్టి తాగాలి.డయాబెటిక్‌ బాధితులకు మెంతి టీ మరొక గొప్ప ఎంపిక. మెంతులలో ఫైబర్‌ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర శోషణను తగ్గిస్తుంది. మెంతి టీ చేయడానికి, ఒక కప్పు వేడి నీటిలో ఒక చెంచా మెంతులు వేసి 10 నిమిషాలు అలాగే పక్కన పెట్టి తాగేయండి. రుచి కోసం కావాలంటే మీరు నిమ్మరసం కూడా యాడ్‌ చేసుకోవచ్చు.దాల్చిన చెక్క టీ మధుమేహాన్ని నియంత్రించడంలో ఉత్తమమైనది. దాల్చినచెక్క రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, ఇన్సులిన్‌ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క టీ చేయడానికి, ఒక కప్పు నీటిలో దాల్చిన చెక్క చిన్న ముక్క వేసి కాసేపు మరగనివ్వాలి. ఆ తర్వాత టీకి బదులుగా తాగేయాలి.ఇంకా అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులకు అత్యంత ఆరోగ్యకరమైన టీలలో గ్రీన్‌ టీ ఒకటి. గ్రీన్‌ టీలోని పాలీఫెనాల్స్‌ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అంతే కాదు, గ్రీన్‌ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. షుగర్‌ సమస్యలు ఉన్న వారు దూరంగా ఉండాల్సిన ఆహారాల్లో టీ కూడా ఒకటి. ఇందులో పాలు, పంచదార ఉన్నందున దీనిని నివారించడం మంచిదని చెబుతున్నారు. అయితే డయాబెటిక్‌ పేషెంట్లు పైన చెప్పిన టీలని తాగితే వారి ఆరోగ్యానికి ఖచ్చితంగా చాలా మేలు కలుగుతుంది. కాబట్టి వాటిని తాగండి.అయితే డాక్టర్‌ సలహా మేరకు మాత్రమే తాగండి.


లవంగాలు తింటున్నారా..!
లవంగాలు తినడం చాలా మందికి అలవాటు. ఏదైనా తిన్న వెంటనే మౌత్‌ ఫ్రెషనర్‌గా కూడా చాలా మంది లవంగాలు తింటుంటారు. కొందరు ఆరోగ్యానికి మంచిదని తింటారు.అయితే లవంగాలు ఆరోగ్యానికి మంచిదే అయినా.. ఈ తప్పులు చేయొద్దని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అవేంటో తెలుసుకుందాం. ఇక లవంగాలు తినడం వలన లైంగిక సామర్థ్యం పెరుగుతుందని ఆరోగ్య నిపుణలు పేర్కొంటారు. అంటు వ్యాధులు, కాలేయ సమస్య రక్తంలో చక్కెర నియంత్రణకు లవంగం చాలా మంచిది అంటారు. లవంగాలు వేడిచేస్తాయనే ఉద్దేశంతో రోజూ వాడం. మసాలా కర్రీలు వండుకునేప్పుడు వాడుతుంటాం. కానీ లవంగాల్లో బయోయాక్టివ్‌ గుణాలున్నాయి. అందువల్ల వీటిని రోజు వాడాలని సూచిస్తారు. లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్‌, ఫెనోలిక్‌ గుణాలు ఉంటాయి. సీ విటమిన్‌ కూడా ఉంటుంది. ఇవి మన శరీరంలోని విష వ్యర్థాలు తిలగిస్తాయి. ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. లవంగాల్లో యూజెనాల్‌ అనే తైలం ఉంటుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు రెగ్యులర్‌గా లవంగాలు వాడడం వలన ఉపశమనం కలుగుతుంది. పేస్టుల తయారీలో లవంగాలను వాడడం యాడ్స్‌లో చూస్తుంటాం. యూజెనాల్‌ తైలం యాంటిసెప్టిక్‌లా పనిచేసి చిగుళ్లను కాపాడుతుంది. నోట్లోని రకరకాల సమస్యలను పోగొడుతుంది. హానికర బ్యాక్టీరియాను చంపేస్తుంది. మన పొట్టలోపల అంతా క్లీన్‌ చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్‌, పొట్ట ఉబ్బరం, అజీర్తిని తగ్గిస్తాయి. జీర్ణరసాలు ఊరేలా చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో లవంగాలు పనిచేస్తాయి. ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచుతాయి. అని కూడా అంటారు. టైప్‌-2 డయాబెటిస్‌ రాకుండా లవంగాలు పనిచేస్తాయి. లవంగాల్లో యూజెనాల్‌ అయిల్‌ బ్రెయిన్‌ కణాలకు టెన్షన్‌ తగ్గిస్తాయి. బ్రెయిన్‌ హీట్‌ ఎక్కకుండా చేస్తాయి. నాడీ సంబంధ సమస్యలు రాకుండా కాపాడతాయి. గర్భిణులు, చిన్నారులు లవంగాలు తినకపోవడం చాలా మంచింది. లేదంటే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి.గ్యాస్‌ ట్రబుల్‌ సమస్య ఉన్నవారు డాక్టర్‌ సూచన మేరకు లవంగాలు వాడుకోవాలి. లేదంటే సమస్య తీవ్రం అవుతుంది.రక్తస్రావం అయ్యే అవకాశం ఉన్నవారు కూడా లవంగాలను తినకూడదు. లివర్‌ సమస్యలు ఉన్నవారు కూడా లవంగాలు తినకూడదు.లవంగాలు రోజూ తినడం మంచిదే అయినా అతిగా తింటే లేనిపోని సమస్యలు వస్తాయి. కాబట్టి లవంగాలు తినే విషయంలో జాగ్రత్తలు అవసరం.


ఈ విషయాల గురించి
డాక్టర్లు పేషెంట్లతో అసలు చెప్పరట..
ఆరోగ్యం పాడైతే వెంటనే డాక్టర్‌ వద్దకు వెళ్తుంటారు. వారు కూడా వ్యాధికి సంబంధించిన మందులు ఇస్తారు. అయితే చాలా మంది డాక్టర్లు మంచి ఆహారం తీసుకోండి అని సలహా ఇస్తారు. కానీ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి అంటూ కొన్ని విషయాల గురించి విడమర్చి చెప్పరు. అయితే కొన్ని విషయాలను పేషెంట్లకు డాక్టర్లు అసలు చెప్పరట. మరి ఆ విషయాలు ఏంటో తెలుసుకోండి. కొన్ని వ్యాధులకు మందులు మాత్రమే పరిష్కారం కాదట.. మందులు వేసుకున్నా ఆహారం కూడా సరిగ్గా తీసుకోవాలట. లేదంటే ఫలితం ఉండదు అని తెలుస్తుంది. షుగర్‌, పీసీఓఎస్‌, థైరాయిడ్‌, ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి మందులతో పాటు ఆహారం ముఖ్యం. ఆ వ్యాధులకు కారణమయ్యే ఆహారాలను అసలు ముట్టుకోవద్దట.ఒకరికి విషం, మరొకరికి ఔషధం.. సన్నగా, ఎముకలు బయటకు కనిపించే శరీరం అంటే ఎక్టోమార్ప్‌ గల వారు ఎక్కువ పిండి పదార్థాలు, తక్కువ ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి. తియ్యటి, పుల్లటి, ఉప్పు, మంచి కొవ్వులు ఉన్న ఆహారం తీసుకోవచ్చు. శరీరాన్ని బట్టి ఆహార అలవాట్లు ఉండాలట. ఎండోమార్ఫ్‌ అంటే స్థూలకాయం, కొవ్వు ఉండే శరీరం గల వారు తక్కువ పిండిపదార్థాలు, ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాట. మందులు బలమైనవే. కానీ వాటిని ఎంత కాలం వాడతారు, ఏ ఔషధాలతో కలిపి తీసుకుంటున్నారు? అనే విషయాలను బట్టి మంచి చెడులు ఉంటాయట. చాలా మందుల మీద ఎక్కువ కాలం వాడితే కాలేయానికి హానీ అని రాసి మరీ ఉంటుంది. పారాసిటామల్‌ వల్ల, గర్భనిరోధక మాత్రల వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి. అందుకే డాక్టర్‌ ను ఈ విషయం అడిగి తెలుసుకోవడం ముఖ్యం. మందులు వాడుతున్నప్పుడు ముఖ్యంగా ఆల్కహాల్‌, స్మోకింగ్‌ మానేయాలి. దీని వల్ల సమస్యలు మరింత పెరుగుతాయి. సో డాక్టర్లు చెప్పని ఈ విషయాల గురించి మీరే అవగాహన పెంచుకోవాలి.


సమ్మర్‌ స్పెషల్‌ సీమచింతకాయలు..
సీమచింతతో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి మంచి ప్రత్యామ్నాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. విటమిన్‌-సి సమృద్ధిగా ఉన్నందువల్ల సీమ చింతకాయ తింటే శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఇందులో విటమిన్‌, ఎ, బి, సిలతో పాటు మెగ్నీషియం, ఐరన్‌ ఇంకా ఇతర పోషకాలు పుష్కలంగా వుంటాయి. సీమ చింతలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. విటమిన్‌- సి, ఎ, పొటాషియం, ఐరన్‌ లాంటి అనేకానేక విటమిన్లు, మినరల్స్‌ ఇందులో ఉన్నాయి. ఇందులోని డైటరీ ఫైబర్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచి, ఏకాగ్రతను కలిగించే గుణం వీటిలో వున్నాయి.చీమ చింతకాయలను మధుమేహులు కూడా తగు మోతాదులో తింటే ఏమి కాదంటున్నారు నిపుణులు. సీమ చింతకాయలలో గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువ. కాబట్టి, రక్తంలో చక్కెర స్థాయులను త్వరగా పెంచదు. అలా డయాబెటిస్‌ ఉన్నవారికీ సీమచింత మంచి ఆహారమే. బరువు తగ్గాలనుకునేవారికి చీమచింతకాయలు మంచి ఆహారం అంటున్నారు. చీమచింతలో క్యాల్షియం నిల్వలున్న కారణంగా ఎముక బలానికి ఉపయోగపడతాయి. మానసిక ఒత్తిడితో బాధపడేవారికి చీమ చింతకాయలు ఔషధంలా పనిచేస్తాయి. మోతాదుకి మించి వీటిని తింటే జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. సీమ చింతకాయలో విటమిన్‌-ఎ ఉంటుంది. దీంతో కంటిచూపు మెరుగ్గా ఉండేలా చూస్తుంది. కేలరీలు తక్కువ, ఫైబర్‌ ఎక్కువ. అలా బరువు తగ్గాలనుకునేవారికి సీమచింత మంచి ప్రత్యామ్నాయం. గర్భిణీలు, బాలింతలు వీటిని తినకుండా వుండటమే మంచిదని చెబుతున్నారు. వగరుగా వుండే చీమచింతకాయలు తింటే గొంతు పట్టుకుంటుంది కనుక వాటిని తినకూడదని చెబుతున్నారు.

📰 e-Paper Clip