పెళ్లికి నిరాకరించిన వ్యక్తికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

💔 ప్రేమలో మోసం – యువతి ఆత్మహత్య


పెళ్లికి నిరాకరించిన వ్యక్తికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష


ఆదిలాబాద్, నవంబర్ 6: ప్రేమించి పెళ్లికి నిరాకరించి యువతి ఆత్మహత్యకు కారణమైన వ్యక్తికి న్యాయస్థానం
10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది.
ఈ తీర్పును అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి సీఎం రాజ్యలక్ష్మి గారు మంగళవారం వెలువరించారు.


ఈ కేసులో 10 మంది సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేయబడ్డాయి.
విచారణలో నిందితుడిపై నేరం నిరూపితమవడంతో కోర్టు కఠిన తీర్పు ప్రకటించింది.


📜 కేసు వివరాలు


నిందితుడు: ఉప్పారపు శ్రీనివాస్ (21) s/o జయరాజ్, కజ్జర్ల గ్రామం, తలమడుగు మండలం.

బాధితురాలు: ప్రణీష (21) d/o జువ్వాడ నారాయణ, రియాడి గ్రామం, తలమడుగు మండలం.


బాధితురాలి తండ్రి జువ్వాడ నారాయణ ఫిర్యాదు మేరకు
ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో
క్రైమ్ నెంబర్ 170/2023, సెక్షన్ 306 IPC కింద కేసు నమోదు చేశారు.


🕵️‍♀️ దర్యాప్తు వివరాలు


విచారణలో బయటపడిన వివరాల ప్రకారం బాధితురాలు ప్రణీష
రిమ్స్ పారామెడికల్ కళాశాలలో చదువుతూ,
ఆదిలాబాద్ న్యూరో హాస్పిటల్లో పనిచేస్తూ ఉండేది.


గత రెండు సంవత్సరాలుగా నిందితుడు ఉప్పారపు శ్రీనివాస్ అనే యువకుడితో ప్రేమలో ఉన్నది.
ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ,
శ్రీనివాస్ ఇటీవల పెళ్లికి నిరాకరించాడు.


దీంతో మనస్తాపానికి గురైన బాధితురాలు 2023 నవంబర్ 29న స్థానిక పార్కులో
యాసిడ్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది.
రిమ్స్‌లో చికిత్స పొందిన ఆమెను హైదరాబాద్ తరలించే క్రమంలో మార్గమధ్యలో మరణించింది.


⚖️ కోర్టు తీర్పు


కేసు దర్యాప్తు అధికారి ఏ. హరిబాబు ఎస్ఐ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
కోర్టు లైసెన్స్ అధికారి ఏ. వెంకటమ్మ, డ్యూటీ అధికారి ఎం. అశోక్
పది మంది సాక్షులను ప్రవేశపెట్టారు.


ప్రభుత్వ పక్ష న్యాయవాది షాహినా సుల్తానా నేరాన్ని రుజువు చేయగా,
అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి సీఎం రాజ్యలక్ష్మి గారు నిందితునికి
10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.


👮‍♂️ పోలీసుల కృషికి అభినందన


కేసు దర్యాప్తు ప్రారంభం నుండి నిందితునికి శిక్ష పడే వరకు కృషి చేసిన పోలీసు అధికారులను
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, IPS
ప్రత్యేకంగా అభినందించారు.
కోర్టు లైసెన్స్ అధికారి ఏ. వెంకటమ్మ ఈ వివరాలను వెల్లడించారు.

📰 e-Paper Clip