నిర్లక్ష్యానికి ప్రాణం ఖరీదు...

నిర్లక్ష్యానికి ప్రాణం ఖరీదు...

*మద్యం మత్తులో ప్రమాదం చేసి మహిళ మరణానికి కారణం అయిన వ్యక్తి అరెస్టు*

*నిందితుడి అరెస్టు రిమాండ్ కు తరలింపు.*

*చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానమే*

*- బోథ్ సీఐ గురు స్వామి*

ఆదిలాబాద్ జిల్లా బోథ్ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోని బజార్హత్నూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ ఒకరు దుర్మరణం చెందిన ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

*వివరాల్లోకి వెళ్తే —*
నవంబర్ 9, 2025 సాయంత్రం సుమారు 18:30 గంటలకు బజార్హత్నూర్ గ్రామానికి చెందిన చేవుల రత్నమాల (48 సం||) తన కుమారుడు చేవుల లక్ష్మణ్ (22 సం||) తో కలిసి వ్యవసాయ పనులు ముగించుకొని ఎద్దుల బండిపై గ్రామానికి వెళ్తుండగా, అదే సమయంలో నిందితుడు *తరడపు ప్రదీప్ కుమార్* , తన వాహనం కారు నంబర్ 23BH5470G ను మద్యం మత్తులో అత్యంత నిర్లక్ష్యంగా, వేగంగా నడుపుతూ, బజార్హత్నూర్ గ్రామ శివారులో ఎద్దుల బండిని ఢీ కొట్టాడు.

ఈ ప్రమాదంలో బాధితురాలు చేవుల రత్నమాల గాయాలతో అక్కడికక్కడే మరణించగా, కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దర్యాప్తు ద్వారా నిందితుడు మద్యం సేవించి వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపినట్లు నిర్ధారణ కావడంతో, బోథ్ పోలీసు సీఐ గురు స్వామి పర్యవేక్షణలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.

పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ — వాహనం నడిపే ముందు మద్యం సేవించడం తప్పించుకోవాలని, అలాంటి నిర్లక్ష్య చర్యలు ప్రాణాంతకమని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బోథ్ ఎస్ఐ సాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

📰 e-Paper Clip