*ప్రతి ఒక సమస్య పట్ల బాధ్యతయుతంగా వ్యవహరించాలి.*
*సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల రోజు నిర్వహణ*
*32 ఫిర్యాదులు స్వీకరణ, వెంటనే పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా సూచనలు.*
- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్
సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల రోజును జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి ప్రజలు జిల్లా ఎస్పీ గారిని నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. సమస్యలను విన్న జిల్లా ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చి బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రతి ఒక్క సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వతంగా పరిష్కారం చూపాలని ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు పోలీసు ముఖ్య కార్యాలయంలో దాదాపు 32 మంది ఫిర్యాదుదారులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. సమస్యలను విన్నవించుకున్న వారిలో భూ సమస్యలు, ఫోర్జరీ సమస్యలు, అన్నదమ్ముల కుటుంబ తగాదాలు, వివిధ కేసుల కు సంబంధించిన ఫిర్యాదులను జిల్లా ఎస్పీ గారికి ప్రజలు నేరుగా తెలియజేశారు. సుదూర ప్రాంతాల ప్రజలు జిల్లా ఎస్పీ గారికి సమాచారం అందించాలన్న సమస్యలను విన్నవించాలన్న మెసేజ్ యువర్ ఎస్పీ అనే కార్యక్రమం ద్వారా ప్రారంభించబడిన 8712659973 నెంబర్ కు వాట్సప్ ద్వారా సమాచారం కానీ ఫిర్యాదులను కానీ తెలియజేయవచని సూచించారు. ఈ కార్యక్రమంలో సిసి కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్ కవిత, సిబ్బంది వామన్ తదితరులు పాల్గొన్నారు.